నిజంనిప్పులాంటిది

May 11 2023, 13:52

గాలికి పోయే కంప ను మన సారు.....

కరీనంగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో దారుణం చోటుచేసుకుంది. సీటు కోసం ఆడవాళ్ల మధ్య గొడవ జరిగింది. అయితే.. ఆ గొడవ పెట్టుకున్న మహిళల్లో ఒకరు ఎస్సై భార్య ఉంది. దీంతో.. గొడవ విషయం తన భర్తకు ఫోన్ చేసి చెప్పటంతో.. సినిమా స్టైల్‌లో ఆ ఎస్సై ఎంట్రీ ఇచ్చాడు. అంతేనా.. నోటికొచ్చినట్టు అమ్మాయిని తీడుతూ.. జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి కొట్టాడు.. బూటు కాలితో తన్నాడు కూడా. ఈ ఘటన ఇప్పుడు జగిత్యాలలో తీవ్ర చర్చనీయాంశం మారింది.

ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవలు జరుగుతుండటం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే.. అలాంటి గొడవలు.. సాధారణంగా సీటు దొరికితేనే.. సదరు ప్రయాణికుల గమ్యస్థానాలు వస్తేనో.. లేదా బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు మందలిస్తేనో, సముదాయిస్తేనో సద్దుమణిగిపోతాయి. కానీ.. ఇక్కడ మాత్రం సీటు కోసం జరిగిన గొడవలో ఓ ఎస్సై సినిమా స్టైల్‌లో బస్సును కారుతో ఛేజ్ చేసిన మరీ ఎంట్రీ ఇచ్చారు. అక్కడి వచ్చి ఇద్దరిని మందలించి సమస్యకు పరిష్యారం చెప్పాడా అంటే.. ఆయన కూడా ఓ యువతిపై దాష్టికానికి దిగారు. అమ్మాయిని అందరి ముందే జుట్టుపట్టుకుని కిందికి లాక్కొచ్చారు. బూటుు కాలితో తంతూ.. కర్కశంగా వ్యవహరించారు. ఈ దారుణమైన ఘటన.. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఓ బస్సులో చోటుచేసుకుంది.

అయితే.. బెజ్జంకి నుంచి షేక్ ఫర్హా (22) అనే MBA విద్యార్థిని, ఆమె తల్లితో కలిసి జగిత్యాల వెళ్లేందుకు ఓ ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే.. అదే బస్సులో జగిత్యాల వెళ్తున్న మరో మహిళ కూడా ఎక్కింది. అయితే.. ఫర్హా, ఆమె తల్లి కూర్చుకున్న సీటులోనే కూర్చుంది. అయితే.. బస్సు వెళ్తున్న సమయంలో పదే పదే ఇంకొంచెం జరగాలంటూ విసిగించటంతో.. వాళ్లు అసహనానికి లోనయ్యారు. దీందో.. వాళ్ల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. ఒకరికొకరు మాటలు అనుకున్నారు. దీంతో.. ఆ మహిళ వెనకి సీటులోకి వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ముందు కూర్చుకున్న సీటు దగ్గరికి వచ్చి కూర్చుంది. తన భర్త ఎస్సై అని.. అతనికి ఫోన్ చేసి.. జరిగిన గొడవ గురించి చెప్పాని.. కాసేపట్లో వచ్చి మీ సంగతి చూస్తాడు అంటూ ధమ్కీ ఇచ్చింది. దానికి.. వాళ్లిద్దరూ జగిత్యాల బస్టాండులో దిగిన తర్వాత మాట్లాడదామని తెలిపారు..

అయితే.. బస్సు జగిత్యాలలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే సినిమా స్టైల్‌లో కారుతో అడ్డగించి సివిల్ డ్రెస్సులో ఎస్సై అనీల్, ఖాకీ డ్రెస్‌లో ఒక కానిస్టేబుల్ బస్సును అడ్డుకున్నారు. బస్సులోకి ఎక్కి తన భార్యతో ఎవరు గొడవ పెట్టుకున్నారంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. షేక్ ఫర్హా, ఆమె తల్లిని తన భార్య చూపించడంతో వారి దగ్గరికి వచ్చి దూషిస్తూ.. తీవ్రంగా బెదిరించాడు. భయపడ్డ అమ్మాయి తన ఫోన్‌లో వీడియో చాట్ ఆన్ చేసి ఫ్రెండ్ నెంబర్‌కి పెట్టింది.

అది గమనించిన ఎస్సై అనిల్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ.. ఆ అమ్మాయి మీద ఎస్సై అనిల్ చేయి చేసుకున్నాడు. అమ్మాయి జుట్టుపట్టి మరీ బస్సు నుండి బయటికి లాక్కొచ్చి కొట్టాడు. బూటు కాళ్లతో తన్నాడు. అనిల్ భార్య ఆ అమ్మాయి తల్లి మీద చేయిచేసుకుంది. అక్కడ అంతమంది జనాలు ఉన్నా చూస్తున్నారే కానీ ఏవరూ ఆపే సాహం చేయకపోవటం గమనార్హం. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి అనీల్‌ని నిలదీసింది. దీంతో ఆ అమ్మాయి పగిలిన ఫోన్, బస్సు టికెట్లు, పర్సు లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఎస్సై. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అధికారులు ఎస్ఐ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

May 11 2023, 13:50

మద్యం దుకాణానికి తాళాలు వేసి బైఠాయింపు

మర్రిగూడ, ఇటీవల ప్రభుత్వం తగ్గించిన ధరలకే మద్యం విక్రయించాలని మద్యం ప్రియులు డిమాండ్‌ చేశారు. మర్రిగూడ మండలకేంద్రంలోని మూడు వైన్‌షాపులకు బుధవారం రాత్రి తాళాలు వేసి బైఠాయించారు. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్లు ప్రకటించినా స్థానిక పద్మావతి, వెంకటసాయి, శ్రీసాయి మద్యం దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పాత ధరలకే మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం తగ్గించిన ధరలకు మీరు ఎందుకు విక్రయించడం లేదంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. పాత స్టాక్‌ ఉన్నందున దానిపై ఉన్న ధరలకే విక్రయిస్తున్నామని, కొత్త స్టాక్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ధరలకు విక్రయిస్తామని వైన్‌ షాపుల యజమానులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రంగారెడ్డి మద్యం దుకాణాల వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు.

మూడు దుకాణాల యజమానులు సిండికేటై ఇష్టానుసారం మద్యం విక్రయిస్తున్నారని ఎస్‌ఐకి చెప్పారు. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిన మాట వాస్తవమేనని, కానీ పాత స్టాక్‌ ఉన్నందున తాము వాటిపై ఉన్న ధరలకే అమ్ముతున్నామని నిర్వాహకులు తెలిపారు. మద్యం ప్రియులకు ఎస్‌ఐ రంగారెడ్డి నచ్చజెప్పి దుకాణాలను తెరిపించి యథావిధిగా కొనుగోలు చేయించారు.

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 11 2023, 11:32

ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం..కరెంట్ కోతలు తప్పవా !

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులు ఎండలు మండిపోతుండటంతో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది..

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగడంతో.. సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభం అయింది.

దీంతో అందుబాటులోకి రెండు వేల మెగావాట్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ వినియోగం తగ్గడంతో యూనిట్లను అండర్ రిజర్వ్ షట్ డౌన్ లో పెట్టింది NTPC.

ఇక ఇప్పుడు సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభించారు. ఏపీలో కరెంట్‌ కోతలు లేకుండా.. ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు.

ఇది ఇలా ఉంటే, నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ, ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 11 2023, 10:39

శీర్షిక: దైవ స్వరూపాలు.

- శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి )

•ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

గుండెల్లో గుప్పెడంత బాధను దాచుకొని

చెదరని చిరునవ్వుల్తో ఆత్మీయతను

అలంకరించుకొని పున్నమి చంద్రుడి దుస్తులు ధరించి....

దావఖానల్లో ఉన్న రోగుల గొంతులో అమృతం పోసి బ్రతికించే దేవకన్యలు మీరు..!

నిరాశ నిస్పృహలతో మంచాన పడ్డ రోగులకు

మనోధైర్యాన్ని నింపి మామూలు మనిషిని చేసిన మనసున్న మహారాణులు మీరే..!

రోగులకు మీరు చేస్తున్న సేవాబంధం

అక్షర కుసుమాలతో అల్లుకున్న పద వాక్యాల బంధం

లాగా పుడమిపై వెలసిన కరుణా మాతృమూర్తులు మీరు..!

ఎల్లవేళలా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు మనస్పూర్తిగా ధన్యవాదలు తెలుపుకుంటూ..

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు.

- శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి )

9347042218

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

యాదాద్రి భువనగిరి జిల్లా.

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 11 2023, 10:34

ఎవరిని బాధ్యులను చేద్దాం ❓️

తెలంగాణ రాష్ర్టానికి చెందిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి విడుదల చేశారు. ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఉత్తీర్ణత 86 .60 శాతం గా వచ్చింది. అంతేకాకుండా 2793 స్కూల్స్ లో పరీక్ష రాసిన మొత్తం విద్యార్థులు పాస్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిలో 1410 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, మిగిలినవి ప్రభుత్వ పాఠశాలలు. కాగా ఇక్కడ ఒక షాకింగ్ విషయం రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా

25 స్కూల్స్ లో కనీసం ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వకపోవడంపై పిల్లల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కోల్పోతున్నాయి, ఉపాధ్యాయులు ఎప్పుడు జీతాలు, పి ఆర్ సి లు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు సెల్ ఫోన్లతో కాలక్షేపం మీద పెట్టిన శ్రద్ధ పిల్లల చదువుపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా? ఇప్పుడు ఈ సంఘటన సంచలనంగా మారింది. అయితే ఈ 25 స్కూల్స్ ఏ జిల్లాలో ఉన్నవి అన్నది తెలియాల్సి ఉంది.

ఈ పాఠశాలలలో ఒక్క విద్యార్హ్ది కూడా పాస్ అవ్వకపోవడం అంటే అక్కడ ఆన్న టీచర్స్ ఏమి చేస్తున్నారు ? ఆ జిల్లా విద్యాశాఖాధికారి ఏమిచేస్తున్నారు ? పర్యవేక్షణ లోపమా ఇలాంటి ఎన్నో సందేహాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచింపచేస్తున్నాయి, ఒక్కొక్క ఉపాధ్యాయులకు వేలు లక్షల్లో జీతాలు తీసుకున్న జీతాలకు సరైన న్యాయం చేస్తున్నారా? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి.

మీలో టీచర్ వృత్తికి ఎంతమంది న్యాయం చేయగలుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటనకు ఎవరిని బాధ్యులను చేద్దాం విద్యాశాఖ మంత్రి ని రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దామా? లేక 25 స్కూల్లో టీచర్లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేద్దామా? దీనికి ఎవరు బాధ్యులను చేద్దాం.

పాఠశాలలో ప్రాథమిక విధి విద్యను ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా తన విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యేలా చూసుకోకపోతే ఆ పాఠశాలను నిర్వహించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు నాణ్యమైన విద్యను అందించే టీచర్లను నియమించండి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి.

నిజంనిప్పులాంటిది

May 10 2023, 21:33

మళ్లీ హంగ్‌ తప్పదా..?

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. తాజాగా వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూస్తే కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లు వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

దీంతో కన్నడనాట మళ్లీ హంగ్‌ తప్పకపోవచ్చనే పరిస్థితి కనిపిస్తోంది. జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతుండటంతో ఎప్పటి మాదిరిగానే దేవేగౌడ పార్టీ కింగ్‌ మేకర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 10 2023, 21:32

Cyclone Mocha: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం...అండమాన్ అప్రమత్తం

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడి వాయుగుండంగా మారనుంది.(Bay of Bengal) దీంతో అండమాన్ దీవుల్లో(Andaman) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక(alert) జారీ చేశారు.మత్స్యకారులు, చిన్న ఓడలు, పడవలు, ట్రాలర్ల నిర్వాహకులు ఆగ్నేయ, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలోకి చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు.మే 12వతేదీ ఉదయం వరకు అల్పపీడనం మొదట ఉత్తర వాయువ్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు కదులుతుందని అంచనా..

ఈ అల్పపీడనం బుధవారం తుఫానుగా మారుతుందని వాతావరణ కార్యాలయం తెలిపింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.ఈ అల్పపీడనం రానున్న 12 గంటల్లో మోచా తుఫానుగా(Cyclone Mocha) మారుతుందని, గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అండమాన్,నికోబార్ దీవుల్లో మంగళవారం నుంచి గురువారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 10 2023, 21:30

Pawan Kalyan: కడియంలో పాడైన పంటలను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌

కడియం: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పరామర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనసేనానికి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు..

అనంతరం పవన్‌.. కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్‌ కల్యాణ్‌ అడిగి తెలుసుకున్నారు..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 10 2023, 21:27

Karnataka Elections: కొనసాగుతున్న పోలింగ్‌.. లైన్‌లో నిల్చుని ఓటేసిన కన్నడ ప్రముఖులు

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) పోలింగ్ బుధవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు..

ఓటేసిన ప్రముఖులు

తొలి గంటల్లో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, మైసూరు రాజమాత ప్రమోదా దేవి వడియార్‌, నటులు ప్రకాశ్‌రాజ్‌, ఉపేంద్ర, రమేశ్ అరవింద్‌, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దంపతులు, భాజపా ఎంపీ తేజస్వీ సూర్య తదితరులు తొలి గంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా క్యూ లైన్లలో నిల్చుని తమ వంతు వచ్చేవరకు వేచి చూసి ఓటు వేశారు.

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 10 2023, 11:28

విద్య.. వైద్యాన్ని జాతీయం చేయాలి : ఆర్ నారాయణ మూర్తి

‘‘పేపర్‌ లీకేజ్‌ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా జరిగాయి. ఇలాగైతే నిరుద్యోగులు ఏమైపోవాలి? అందుకే విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు ఆర్‌. నారాయణ మూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్‌పై ఆర్‌. నారాయణ మూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘భారత దేశంలో చాలా చోట్ల పేపర్‌ లీకేజీలు జరుగుతున్నాయి.. దీన్ని జాతీయ సమస్యగా పరిగణించాలని ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు..

SB NEWS

SB NEWS

SB NEWS